బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళన చేసిన కేసులో విచారణను మహారాష్ట్రలోని ధర్మాబాద్ న్యాయస్థానం వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌పైనా కోర్టులో వాదనలు జరిగాయి. ఆయన తరపున వాదనలు వినిపించిన సుబ్బారావు వాయిదా కోరారు. నోటీసులు అందుకున్న వారు ఎందుకు హాజరుకాలేదంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు.
దీనికి చంద్రబాబు తరపు న్యాయవాది స్పందిస్తూ.. కోర్టుకు హాజరయ్యేందుకు సమయం కోరారు. దీంతో న్యాయస్థానం కేసు విచారణను అక్టోబరు 15కు విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న చంద్రబాబుతో సహా 16 మంది ఆ రోజు న్యాయస్థానానికి తప్పకుండా హాజరు కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.మరోవైపు ఇదే కేసులో తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రకాశ్‌గౌడ్, రత్నంకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వారి ముగ్గురికి రూ.5వేల చొప్పున జరిమానా విధించింది.