
Dhanush remuneration:
తమిళ నటుడు ధనుష్ తెలుగులో తన మార్కెట్‌ను విస్తరించేందుకు బిజీగా ఉన్నారు. ఇటీవలే “సార్” సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “కుబేర” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాల కోసం ఆయన తమిళ చిత్రాల కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.
తమిళంలో నిర్మాతలు పెద్ద పారితోషికం ఇవ్వడంలో వెనుకంజ వేస్తుండడంతో ధనుష్ ఇప్పుడు తెలుగులో అవకాశాలు చూస్తున్నారు. అంతేకాకుండా, తన సొంత బ్యానర్‌పై తమిళంలో సినిమాలను నిర్మిస్తూ, దర్శకుడిగానూ వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు.
తాజాగా, ఒక యంగ్ నిర్మాతతో తన తదుపరి తెలుగు సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను “సార్” ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. అయితే, ధనుష్ ఈ సినిమా కోసం రూ.60 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారట. ఈ డిమాండ్ నిర్మాతలను ఆశ్చర్యపరిచింది.
మరోవైపు, దుల్కర్ సల్మాన్ కూడా తెలుగులో చిన్న మార్కెట్ ఉన్నప్పటికీ, పెద్ద మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌కి కారణం తెలుగులో సౌత్ హీరోలకి ఉన్న క్రేజ్ అని చెప్పాలి. అయితే, ధనుష్ డిమాండ్ చేసిన మొత్తం నిర్మాతలకి కాస్త భారంగా మారిందని సమాచారం.
ALSO READ: Abhishek Bachchan ప్రతినెల ఎస్ బీ ఐ నుండి రూ.18 లక్షలు సంపాదిస్తున్నాడా?