HomeTelugu Trending'లోకల్‌ బాయ్'గా మారిన ధనుష్‌

‘లోకల్‌ బాయ్’గా మారిన ధనుష్‌

2 26
కోలీవుడ్‌ హీరో ధనుష్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలను విడుదల చేస్తుంటారు. ఇటీవల తమిళనాట విడుదలైన ధనుశ్ సినిమా ‘పట్టాస్’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేయగా, స్నేహ .. మెహ్రీన్ హీరోయిన్‌లుగా నటించారు.

దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ‘లోకల్ బాయ్’ టైటిల్ తో నిర్మాత సతీశ్ కుమార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను ఇక్కడ విడుదల చేయనున్నారు. ధనుష్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుని మరీ ధనుష్‌ చేశాడు. నవీన్ చంద్ర ఈ సినిమాలో విలన్‌గా నటించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu