హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘జగమే తంత్రం’. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ధనుష్ మాస్ లుక్ ఆకట్టుకుంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఉంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్ర పోషించారు.
ధనుష్‌కి ఇది 40వ చిత్రం కావడంతో.. ఆయన అభిమానులు D40 పేరుతో హాష్‌టాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ‘జగమే తంత్రం’ నిర్మించాయి. ఎస్. శశికాంత్ నిర్మాతగా, సహ నిర్మాతగా చక్రవర్తి రామచంద్రన్ వ్యవహరించారు. మే 1న ఈ చిత్రం విడుదల కానుంది.