HomeTelugu Trendingశేఖర్‌ కమ్ముల పనిచేయబోతున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నా: ధనుశ్‌

శేఖర్‌ కమ్ముల పనిచేయబోతున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నా: ధనుశ్‌

Dhanush is excited with sek

టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా కోలీవుడ్‌ హీరో ధనుశ్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అభిమానులు చాలా ఆసక్తికరంగా ఉన్నారు. మాస్‌ హీరో ధనుశ్ తో ప్రేమ కథల స్పెషలిస్ట్‌.. శేఖర్ కమ్ముల సినిమా చేయనుండటం .. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండటం మరింత విస్మయులను చేసింది. ఈ నేపథ్యంలో .. ధనుశ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో .. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావు నిర్మాణంలో కలిసి పనిచేయబోతున్నందుకు తనకి చాలా ఎగ్జైటింగ్ గా ఉందని అన్నాడు. ధనుశ్ చేస్తున్న తొలి తెలుగు సినిమా కావడంతో, ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన ‘లవ్ స్టోరీ’ విడుదలకు రెడీ అవుతుంది. థియేటర్లు తెరుచుకున్న వెంటనే ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!