మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ కథ విని ఫిదా అయిపోయానని చెప్పాడు. దర్శకుడు బుచ్చిబాబు తన గురు సుకుమార్ కు తగిన శిష్యుడు. అతని ఆలోచనా విధానం.. సుక్కూ మాదిరిగానే ఇతరులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సుక్కూ సహాయకుడిగా బుచ్చి ఎప్పుడో తెలుసు. ఆయన ఉప్పెన కథ విన్న తర్వాత నేను ఫిదా అయ్యాను. ఇది చాలా వైవిధ్యమైన ధైర్యమైన కథ.’’ అని చెప్పారు దేవీశ్రీ ప్రసాద్.
సుకుమార్ చిత్రాల కోసం తాను మ్యూజిక్ కంపోజ్ చేసిన అన్ని పాటలకూ బుచ్చిబాబు సందేశాలిచ్చేవాడని దేవి చెప్పారు. ఇక బుచ్చిబాబు నుంచి తాను అందుకున్న ప్రశంసను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నాడు డీఎస్‌పీ. “నేను ‘జల జలా..’ ట్యూన్ బుచ్చికి పంపిన తరువాత.. అతను సర్.. నా కథను మీరు నాకన్నా బాగా అర్థం చేసుకున్నారు అన్నాడు. ఇది నేను ఎన్నటికీ మరిచిపోలేను. ఇక రీ-రికార్డింగ్ తర్వాత సినిమా చూసిన బుచ్చి.. నన్ను కౌగిలించుకుని ‘విజయ్ సేతుపతిని సెల్ఫీలు అడగడానికి ప్రజలు భయపడతారు’ అని అన్నారు.’’ అని చెప్పుకొచ్చారు.