HomeTelugu TrendingDevara Update: పక్కా ప్లానింగ్ తో దేవర ప్రమోషన్స్ మొదలు

Devara Update: పక్కా ప్లానింగ్ తో దేవర ప్రమోషన్స్ మొదలు

Devara Update
Devara Update: Plan locked for Movie Promotions

Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రెండవ సినిమా దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్ 27న ఈ సినిమా విడుదలవుతుంది అని చిత్ర బృందం ప్రకటించింది. అయితే సినిమా ప్రమోషన్లు ఎప్పుడు మొదలవుతాయి అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫాన్స్ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక షెడ్యూల్ కూడా ప్లాన్ చేసేశారు.

జులై 15న సినిమాకి సంబంధించి ఒక పాట విడుదల అవుతుందని, ఆగస్టు 5న సినిమాకి సంబంధించిన మూడవ పాట విడుదలవుతుందని చెబుతున్నారు. ఇక ఆగస్టు 15న చెన్నైలో సినిమాకి సంబంధించిన ఈవెంట్ కూడా జరగబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Devara Update:

ఇక సెప్టెంబర్ అంటే సినిమా విడుదల అయ్యే నెలలో కూడా సినిమాకి సంబంధించి భారీ ఈవెంట్లు ప్లాన్ చేసింది చిత్ర బృందం. సెప్టెంబర్ మూడవ తేదీన సినిమా నుంచి నాలుగవ పాట విడుదల కాబోతోంది. ఇక అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్ర అధికారిక ట్రైలర్ సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది.

సెప్టెంబర్ 10వ తేదీన ముంబైలో, 15వ తేదీన యుఎస్ఎలో ఈవెంట్లు ప్లాన్ చేసిన చిత్ర బృందం సినిమా విడుదల కి వారం ముందు సెప్టెంబర్ 20వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకచోట ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది. ఇక సెప్టెంబర్ 27న సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటిదాకా సినిమా అప్డేట్ ల కోసం ఎదురుచూసి చూసి విసిగిపోయిన అభిమానులు కనీసం ఇవైనా నిజమవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఇవన్నీ అయ్యే పనులు కాదులే అని కొట్టి పారేస్తున్నారు. ఈ ప్లానింగ్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ రకంగా ప్లాన్ చేస్తే మాత్రం అభిమానులకు అది పండగే అవుతుంది అని చెప్పుకోవచ్చు.

ఇక ఈ ప్రమోషన్ల గురించి పక్కన పెట్టేస్తే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల మధ్య ఒక అదిరిపోయే డ్యూయెట్ షూటింగ్ శంషాబాద్ లో జులై 10 నుంచి ఒక భారీ సెట్ లో జరగనుంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu