HomeTelugu Trendingదేవర టీజర్‌ వచ్చేది అప్పుడేనా!

దేవర టీజర్‌ వచ్చేది అప్పుడేనా!

Devara Teaser Update
పాన్‌ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా పై మంచి హైప్స్‌ ఉన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ పై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. దేవర టీజర్ ను ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నట్లు టాక్‌. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివతో యంగ్ టైగర్ చేస్తున్న రెండో సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ టీజర్ రిలీజ్ పై అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌డ్యుయల్ రోల్లో నటిస్తున్నాడు.

దేవరను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. దేవర 1 వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువ దృష్టి సారించనున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక దేవర మూవీలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu