యూట్యూబ్ స్టార్- బిగ్‌బాస్ ఫేం.. దేత్తడి హారిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హారిక కొంత కాలంగా ఓ యూట్యూబర్‌ను ప్రేమించిందట. ఈ క్రమంలో అతనితో సీక్రెట్ డేటింగ్ కూడా చేస్తుందట. అతనితో పలు వీడియోల్లో నటించిన హారిక, ఇప్పుడు అతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఈ విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయగా, ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమచారం. అయితే పెద్ద హాడావుడి లేకుండా కొంతమంది బందు మిత్రులతో పాటు, కుంటుంబ సభ్యుల మధ్య సైలెంట్‌గా, సీక్రెట్ లవర్‌తో పెళ్లి చేసుకోవాలని హారిక నిర్ణయించుకుందని వార్తలు వినిస్తుంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. హారిక స్పందించే వరకు వేచి చూడాల్సిందే.