బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారికను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ నేరుగా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రోజుకో వివాదం ఏర్పడింది. తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హారిక ఎవరో తెలియదు అని చెప్పడం సంచలనంగా మారింది. అయితే తాజాగా దేత్తడి హారిక ఈ విషయంపై స్పందించింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు హారిక ప్రకటించింది.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. ‘‘అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్‌డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే.. కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. లవ్యూ ఆల్’’ అంటూ హారిక చెప్పుకొచ్చింది. హారిక బ్రాండ్ అంబాసిడర్ అంశం తెలంగాణతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Here is the update .As you all know, Was appointed for Promoting and Marketing the Tourism dept hotels and properties earlier,but then will not be continuing it further due to several other reasons .And thanks to all my well-wishers,and sorry for all the disappointment,love u all pic.twitter.com/SzLAaIPxwR
— Alekhya Harika (@harika_alekhya) March 10, 2021