
Akhil Akkineni Wedding:
అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలైంది! ఇటీవల నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల గ్రాండ్ వెడ్డింగ్ అనంతరం, ఇప్పుడు అఖిల్ అక్కినేని పెళ్లికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అఖిల్, జైనబ్ రవ్‌జీలు గత ఏడాది నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ జంట పెళ్లి తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు ఆ రోజు వచ్చేసినట్లే ఉంది! సమాచారం ప్రకారం, అఖిల్, జైనబ్ మార్చి చివరి వారంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి చేసుకోనున్నారు. ఇదే చోట నాగ చైతన్య-శోభిత వివాహం కూడా జరిగింది. అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన ఈ వేదికలో మరో వెడ్డింగ్ జరగనుండడం ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకంగా మారింది.
ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అఖిల్, జైనబ్ ఇటీవల హైదరాబాద్ నుంచి బయల్దేరడం, వీరు షాపింగ్ కోసం వెళ్లారని ఊహాగానాలు రావడం ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
అఖిల్ నిశ్చితార్థం సందర్భంగా నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “మా కొడుకు అఖిల్ అక్కినేని, మా కోడలు జైనబ్ రవ్‌జీ నిశ్చితార్థం చేసుకున్నారని తెలియజేయడం ఆనందంగా ఉంది. జైనబ్ మా కుటుంబంలోకి అడుగుపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
జైనబ్ రవ్‌జీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌జీ కుమార్తె. చిత్రకళలో ఎంతో ప్రతిభ గల ఆమె, లండన్, దుబాయ్ వంటి నగరాల్లో తన పెయింటింగ్స్ ప్రదర్శించిందని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే జైనబ్, అఖిల్‌కు పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం కలిగిఉన్నారు.