HomeTelugu Trendingషణ్ముక్‌తో దీప్తి సునైనా బ్రేకప్‌?

షణ్ముక్‌తో దీప్తి సునైనా బ్రేకప్‌?

Deepthi sunaina and shanmuk
ప్రముఖ యూట్యూబ్‌ స్టార్స్‌ షణ్ముక్‌ జశ్వంత్‌-దీప్తి సునైనాల ప్రేమ వ్యవహరం బ్రేకప్‌ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ హౌస్‌లో షణ్ముక్‌.. సిరితో చనువుగా ఉండటమే దీనికి కారణమని తెలిసిందే. హౌస్‌లో సిరి-షణ్ముక్‌లు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవ్వడం, తరచూ హగ్‌లు ఇచ్చుకోవడంతో ఇద్దరూ విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. హౌస్‌లో అడుగు పెట్టడానికి ముందే వీరిద్దరూ వేరేవారితో రిలేషన్‌లో ఉన్నప్పటికీ.. వీరి అతి ప్రవర్తన అందరిని ఇబ్బంది పెట్టింది.

Deepthi 1

ఫలితంగా దీప్తి సునైనా ​​కొద్ది రోజులుగా షణ్నును ఉద్దేశిస్తూ వరుస పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలో ఆమె పోస్ట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతేగాక హౌస్‌ నుంచి బయటకొచ్చాక లైవ్‌లోకి వచ్చిన షణ్నూ కూడా తనను దీప్తి బ్లాక్‌ చేసిందని చెప్పాడు. అవి చూసి వారి ఫాలోవర్స్‌ ప్రస్తుతం షణ్నూపై దీప్తి కోపంగా ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో వారి బ్రేకప్‌ను ఉద్దేశిస్తూ దీప్తి సునైనా తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Deepthi 2

ఈ పోస్ట్‌లో ఆమె ‘మారడం అసౌకర్యంగా ఉంది.. కానీ తప్పదు అంటూ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ షేర్‌ చేసింది. ఇది చూసిన ఆమె ఫాలోవర్స్‌ దీప్తి పోస్ట్‌పై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. షణ్ముక్‌ నుంచి విడిపోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లుగా అభిప్రాయపడుతూ తన నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu