HomeTelugu Big Storiesజిమ్‌లో దీపికా పదుకొణె లుంగి డ్యాన్స్‌.. వైరల్‌

జిమ్‌లో దీపికా పదుకొణె లుంగి డ్యాన్స్‌.. వైరల్‌

8 1
బాలీవుడ్‌ నటి ముద్దుగుమ్మ దీపికా పదుకొణె క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తుంటారు. ఈ క్రమంలో జిమ్‌లో తీసిన ఓ వీడియో బయటికి వచ్చింది. అందులో ఆమె రోప్స్‌తో కసరత్తులు చేస్తూ కనిపించారు. అంతేకాదు అక్కడ పెట్టిన లుంగి డ్యాన్స్‌ పాటకు తనదైన స్టైల్‌లో రోప్‌లతో సరదాగా డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియోను ట్రైనర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘వారాంతం స్ఫూర్తి.. ఫన్‌ ఉండటం కూడా ముఖ్యమే. దీపికకు కష్టపడేతత్వంతో పాటు సరదాగా ఉండే గుణం కూడా ఉంది. 6 గంటల వ్యాయామం ఇలా గడిచింది’ అంటూ కామెంట్‌ చేశారు. దీన్ని కొన్ని గంటల్లోనే 2.48 లక్షల మంది చూశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఛపాక్‌’ సినిమాతో ఇటీవల దీపిక ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేపోయింది. ప్రస్తుతం ఆమె భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ’83’లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu