బాలీవుడ్ నటులు దీపిక-రణ్‌వీర్ ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు. దీపిక-రణ్వీర్ వీళ్ల కోసం ఇప్పుడో సరికొత్త ఫ్లాట్ ఏర్పాటు చేసుకున్నారట. దాని ఖరీదు అక్షరాలా 50 కోట్లు.ముంబయిలోని ఖరీదైన ప్రాంతం జుహులో దీపిక-రణ్‌వీర్ కలిసి ఈ ఇల్లు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంట్లో ఫర్నిచర్, ఇంటీరియర్ ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. ఇటలీలో పెళ్లి చేసుకున్న ఈ జంట, ఇండియా వచ్చిన వెంటనే ఈ ఇంటిలోనే కాపురం పెడుతుంది.
ఇటలీలో సింధి, కొంకణి సంప్రదాయాల్లో వీళ్లు 2సార్లు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల్ని మాత్రమే ఆహ్వానించారు. ఈనెల 21న బెంగళూరులో భారీ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. డిసెంబర్ 1న ముంబయిలో మరో భారీ రిసెప్షన్ పెట్టబోతున్నారు.