వివాహ బంధంతో బాలీవుడ్ ప్రేమ జంట కథ సుఖాంతం అయ్యింది. పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే, విలక్షణ నటుడు రణ్‌వీర్ సింగ్‌లు బుధవారం నాడు ఇటలీలోని లేక్ కొమోలో కొంకణి పద్ధతిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నేడు సిందీ సంప్రదాయంలో వివాహం కానుంది. 2013లో రామ్ లీలా చిత్రంలో జోడీ కట్టిన ఈ ప్రేమజంట సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఈ నెల 14న పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే రామ్ లీలా రిలీజైన తేదీ.. వీరి పెళ్లి నవంబర్ 14 కావడం విశేషం.
అయితే కండోమ్స్ తయారుచేసే కంపెనీ రణ్‌వీర్ దీపికాలకు వినూత్నంగా శుభాకాంక్షలు. ఈ సంస్థ పెట్టే కొటేషన్లు, కామెంట్లు ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ సంస్థ రణ్‌వీర్, దీపిక పెళ్లిపై ఓ కొటేషన్ పెట్టింది. “దీపిక, రణ్‌వీర్ కు శుభాకాంక్షలు. ఇప్పుడు అధికారికంగా రింగ్ తొడిగే అవకాశం వచ్చేసింది.” ఈ కొటేషన్ లో ఎంత కావాలంటే అంత బూతు వెతుక్కోవచ్చు. అంతే కామెడీ కూడా ఉందిక్కడ. తాజాగా సోనమ్ పెళ్లిపై కూడా సదరు కండోమ్స్ కంపెనీ ఇలానే స్పందించింది. “కంగ్రాట్స్ సోనమ్,ఆనంద్.. ఇకపై మేం మిమ్మల్ని కూడా కవర్ చేస్తాం.”
ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. రొమాంటిక్ కామెడీ కొటేషన్స్ తో సదరు సంస్థ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుష్క-విరాట్ పెళ్లి టైమ్ లో కూడా ఈ సంస్థ తనదైన శైలిలో స్పందించింది. “కంగ్రాట్స్ విరుష్క, ఇకపై మీ ఇద్దరి మధ్య ఏదీ రానివ్వకండి.. ఈ ఒక్కటి తప్ప” అంటూ ఫన్నీగా శుభాకాంక్షలు చెప్పింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. దీపికను పెళ్లాడిన రణ్‌వీర్ ఈ కంపెనీకి స్వయానా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ నుంచి ఓ కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న హీరో రణ్‌వీర్ సింగ్ మాత్రమే. పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ అనుభవాలతో ఈ హీరోతో ఇంకాస్త ఫన్నీగా మరో యాడ్ తయారుచేసే పనిలో ఈ కండోమ్ కంపెనీ బిజీగా ఉంది.
We've got you covered. 😉 #DeepVeer #DeepVeerKiShaadi pic.twitter.com/eRL4MnSEXC
— Durex India (@DurexIndia) November 14, 2018
#Amul Topical: Bollywood superstars tie the knot! pic.twitter.com/4shuZSaFmt
— Amul.coop (@Amul_Coop) November 14, 2018