HomeTelugu Big Storiesరణ్‌వీర్‌ వచ్చేటప్పుడు ఇవి తీసుకురావడం మర్చిపోవద్దు: దీపిక

రణ్‌వీర్‌ వచ్చేటప్పుడు ఇవి తీసుకురావడం మర్చిపోవద్దు: దీపిక

7 22
బాలీవుడ్‌ రియల్‌ లైఫ్‌ దంపతులు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె రీల్‌ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. భారత క్రికెట్‌ మాజీ సారథి కపిల్‌దేవ్‌ జీవిత కథ ఆధారంగా.. తెరకెక్కనున్న చిత్రం ’83’. క్రికెట్‌ ప్రపంచంలోకి పసికూనగా అడుగుపెట్టిన భారత్‌ తొలిసారిగా ప్రపంచకప్‌ సాధించి జగజ్జేతగా నిలిచిన క్రమమే కథాంశంగా సినిమా సాగనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 10న అభిమానుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఒక ఫొటోను రణ్‌వీర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. అయితే, దీనిపై ఎవరూ ఊహించని విధంగా దీపిక ఫన్నీగా స్పందించింది. ‘వచ్చేటప్పుడు.. కిలో మైసూర్‌పాక్‌, ఆలు చిప్స్‌ తీసుకురావడం మర్చిపోవద్దు’ అని కామెంట్‌ చేసింది. దీపిక కామెంట్‌పై స్పందించిన దర్శకుడు కబీర్‌ఖాన్‌ భార్య మిని మాథుర్‌.. ‘మీరు కూడా ఇవన్నీ తీసుకురండి’ అని తన భర్త కబీర్‌ఖాన్‌ను కోరింది. మరోసారి సోషల్‌ మీడియా వేదికగా నవ్వులు పూయించారు ఈ దంపతులు.

itj36gng

Recent Articles English

Gallery

Recent Articles Telugu