HomeTelugu TrendingIMDB Top 100 Most Viewed Indian Stars: టాప్‌ 1లో దీపికా.. సౌత్‌ నుంచి ఎవరున్నారంటే?

IMDB Top 100 Most Viewed Indian Stars: టాప్‌ 1లో దీపికా.. సౌత్‌ నుంచి ఎవరున్నారంటే?

Deepika Padukone tops IMDb IMDB Top 100 Most Viewed Indian Stars,Deepika Padukone,samantha,alia bhatt,prabhas

IMDB Top 100 Most Viewed Indian Stars: ప్రపంచవ్యాప్తంగా సినిమా సమాచారాన్ని విస్తృత స్థాయిలో అందించే ఐఎండీబీ సంస్థ గత దశాబ్ద కాలానికి సినీ ప్రియులు ఐఎండీబీలో 2014-2024 అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ సినిమా తారల వివరాలను తాజాగా ప్రకటించింది. ఇందులో పెద్ద పెద్ద స్టార్ హీరోలను వెనక్కి నెట్టి హీరోయిన్ బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనే ఫస్ట్‌ ప్లేస్‌లో నిలవడం విశేషం.

దీనిపై దీపికా మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల అభిరుచికి ఈ జాబితా అద్దం పడుతుంది. ఈ వెబ్‌సైట్‌ ప్రేక్షకుల ఆసక్తికి ప్రాధాన్యమిస్తుంది. ఈ గుర్తింపు నాకు చాలా ప్రత్యేకమైనది. ఇంతమంది ప్రేమను పొందుతున్నందుకు నేను అదృష్టవంతురాలిని అనిపిస్తుంది’ అంటూ ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఇక టాప్ 13లో నిలిచిన సమంత ఆనందం వ్యక్తంచేశారు. ‘ఎంతోమంది దర్శకులు, రచయితలు, నిర్మాతల కృషి వల్లే నేను ఈ స్థానంలో ఉన్నాను. ప్రేక్షకులు నాపై చూపే ప్రేమ మరో కారణం. ఎంతో గర్వంగా ఉంది. నాకు ఈ గౌరవాన్ని అందించినందుకు ఐఎండీబీకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

ఇక ఈ టాప్‌ 100 జాబితాలో మొదటి 10మంది బాలీవుడ్‌ స్టార్స్‌ కావడం విశేషం. ఐశ్వర్యారాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ ఈ జాబితాలో వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు.

తమన్నా భాటియా 16వ స్థానం సాధించగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార 18వ స్థానం దక్కించుకుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి బెస్ట్ ర్యాంక్ సాధించింది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. అతడికి 29వ స్థానం దక్కింది. రామ్ చరణ్ (31) నెక్స్ట్ బెస్ట్ ర్యాంక్ దక్కించుకున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్‌కి 35వ ర్యాంకు దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ 42వ స్థానంలో నిలవగా.. విజయ్ సేతుపతి 43వ ర్యాంకు సాధించాడు. అల్లు అర్జున్ 47వ స్థానంలో ఉన్నాడు. మోహన్ లాల్ 48వ ర్యాంకులో నిలిచాడు. కమల్ హాసన్ 54వ స్థానంలో ఉంటే. సూర్య 62, జూనియర్ ఎన్టీఆర్ 67 ర్యాంకులు సాధించారు. మహేష్ బాబుకు 72వ ర్యాంకు దక్కింది. అనుష్క 86వ స్థానంలో నిలిచింది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu