బాలీవుడ్ నటి దీపికా పదుకొనే.. ప్రతిష్టాత్మక క్రిస్టల్ అవార్డు అందుకుంది. కుంగుబాటుపై చేసిన పోరాటానికి గాను.. దావోస్‌లోని ప్రపంచఆర్థిక వేదిక వార్షికసదస్సులో ఈ అవార్డు తీసుకున్నారు. పోరాటంతోనే డిప్రెషన్‌పై గెలవడం సాధ్యమని ఆమె తన జీవితంలో సమస్యలను సభికులతో పంచుకున్నారు. కుంగుబాటు, ఆందోళన ప్రపంపంలో అత్యధికులను వేధిస్తున్న సమస్యలివి. కొందరు భయపడి ప్రాణాలు తీసుకుంటుంటే మరికొందరు ధైర్యంగా ఎదుర్కొంటూ విజేతలుగా నిలుస్తున్నారు. గెలుపు సాధించడమే కాదు మానసిక రుగ్మతలపై పోరాటానికి ఏకంగా లివ్ లవ్ లాఫ్ అనే ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. ఫౌండేషన్ ద్వారా దీపిక అందిస్తున్న సేవల్ని గుర్తించిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు క్రిస్టల్ అవార్డును ప్రదానం చేసింది.