HomeTelugu Trendingఈ ఏడాదిలోనే తొలిబిడ్డకు జన్మనివ్వనున్న దీపికా పదుకొణె

ఈ ఏడాదిలోనే తొలిబిడ్డకు జన్మనివ్వనున్న దీపికా పదుకొణె

Deepika Padukone Ranveer

బాలీవుడ్ జంట దీపికా పదుకొణె- రణవీర్ సింగ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. గత కొన్ని రోజులుగా దీపికా ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 77వ బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ లో దీపికా తన బేబీ బంప్ కవర్ చేసిందంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడ్డింది. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి అధికారికంగా ప్రకటించింది.

ఈ ఏడాది సెప్టెంబర్‏లో తమ మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలకనున్నట్లు వెల్లడించారు. దీపికా.. ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో ఈజంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా వీరి వావాహం 2018లో జరిగింది.

ప్రస్తుతం ఆమె కల్కి 2898 AD చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది మే 9న రిలీజ్ కానుంది. ఇక బాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu