డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో నిన్న రకుల్‌ను విచారించిన ఎన్‌సీబీ అధికారులు ఇవాళ దీపికా పదుకొనెను విచారిస్తున్నారు. అయితే తన భార్య దీపికకు మానసికంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఎన్సీబీ విచారణలో తాను కూడా దీపికతో ఉంటానని అధికారులను రణ్‌వీర్ సింగ్ కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎన్‌సీబీ అధికారులు అవి అవాస్తవమని వెల్లడించారు. దీపిక కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అభ్యర్థన తమకు రాలేదని ఎన్‌సీబీలోని ఓ అధికారి వెల్లడించారు. విచారణకు హాజరవుతానని మాత్రమే దీపిక మెయిల్ చేసినట్లు తెలిపారు.
నిన్న రకుల్‌ను విచారించిన ఎన్‌సీబీ అధికారులు ఇవాళ దీపికా పదుకొనేను విచారిస్తున్నారు. ఈ విచారణలో దీపికా పలు విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. జాతీయమీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దీపికా నిజాలు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ తో 2017 అక్టోబర్ లో డ్రగ్స్ చాట్ చేసినట్లు అంగీకరించినట్టు సమాచారం. దీపిక తన మేనేజరు కరిష్మా ప్రకాష్ మరియు టాలెంట్ మేనేజర్ జయ సాహాలతో జరిపిన వాట్సాప్ ఛాట్ లో నిషేధిత ‘మాల్’ ‘హ్యాష్’ గురించి డిస్కస్ చేసినట్లు బయటకు వచ్చింది.