
Deepika Padukone new lavish property value:
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ ప్రస్తుతం తన జీవితంలో అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు. సెప్టెంబర్ 8న ఆమెకి కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో దీపిక, రణ్వీర్ ల ఇంటిలో కొత్త సంతోషాలు మొదలయ్యాయి.
తల్లిగా మారడాన్ని ఆస్వాదించడంతో పాటు, దీపికా ఇటీవల ఒక విలువైన ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారు. ఆమె కొత్త ఫ్లాట్ కోసం ఏకంగా రూ. 17.73 కోట్లు పెట్టి కొనుగోలు చేసి తనకి తాను గిఫ్ట్ గా ఇచ్చుకుందని టాక్ వినిపిస్తోంది. ఆమె కొన్న ఇల్లు ఆమె అత్త అన్జు భవ్నానీ నివాసానికి చాలా దగ్గరగా ఉంటుందట.
దీపికా, రణవీర్‌లు తమ పాపతో గడుపుతున్న సమయాన్ని చాలా ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో పాప పుట్టిన తర్వాత, ఒకసారి మాత్రమే కెమెరా కంట చిక్కారు. అయితే, ఇప్పటివరకు పాప పేరు లేదా ముఖం బయటపెట్టలేదు. దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో “Feed. Burp. Sleep. Repeat” అంటూ పెట్టిన బయో కూడా వైరల్ అయ్యింది.
కొత్త ఇంటి సంగతికి పక్కన పెడితే.. ఈమధ్యనే ముంబై సముద్రతీరంలో ఉన్న విలాసవంతమైన ఇంటిని రూ. 119 కోట్లకు వారు కొనుగోలు చేశారు దీపిక రణ్వీర్. ఈ ఇల్లు బాంద్రాలో, షారుక్ ఖాన్ మన్నత్ పక్కనే ఉంది. ఈ ఫ్లాట్ 11,266 చదరపు అడుగుల స్థలంతో, 1,300 చదరపు అడుగుల ప్రైవేట్ పాటియోతో ఉంది.
Read More: Thandel: స్టార్ హీరోలతో వద్దు అని సీనియర్ హీరోలతో పోటీ పడుతున్న నాగ చైతన్య
ప్రస్తుతం దీపికా తన కుటుంబంతో సమయాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. 2025లో తిరిగి షూటింగ్‌లో చేరాలనుకుంటున్నారు. అయితే, విరామం తర్వాత దీపికా రణవీర్ సింగ్‌తో కలిసి సింఘం అగైన్ లో నటించనున్నారు, దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. అలాగే, కల్కి 2898 ఏడి పార్ట్ 2 సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో కలిసి నటించనున్నారు.