HomeTelugu News'రాణి పద్మావతి' దీపికా ఆశీర్వాదంతోనే సినిమా హిట్‌ ..ఈదిగో ఫోటో..!

‘రాణి పద్మావతి’ దీపికా ఆశీర్వాదంతోనే సినిమా హిట్‌ ..ఈదిగో ఫోటో..!

6 6రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన సినిమా ‘సింబా’. ఈ మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ప్రస్తుతం 200 కోట్ల రూపాయల క్లబ్‌ వైపు దూసుకుపోతుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాల్లో ‘సింబా’ మూడవదిగా నిలిచింది. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్మాత కరణ్‌ జోహర్‌ ముంబైలోని తన ఇంటిలో సక్సెస్‌ పార్టీ ఏర్పాటు చేశారు.

దీనికి రణ్‌వీర్‌ సింగ్‌, దర్శకుడు రోహిత్‌ శెట్టి, నటి దీపికా పదుకోణ్‌తో పాటు అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సారా అలీ ఖాన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను కరణ్‌ జోహర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలో దీపికా కరణ్‌ జోహర్‌, రోహిత్‌ శెట్టి, తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌ను ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్నారు. దీనికి కరణ్‌ జోహర్‌ ‘రాణి పద్మావతి ఆశీర్వాదంతో మా సినిమా సూపర్‌హిట్‌ అయ్యింద’నే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ ఫోటోని అభిమానులు తెగ లైక్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu