HomeTelugu Trendingదీపికా- రణవీర్‌ విడిపోతున్నారా.. న్యూస్‌ వైరల్‌

దీపికా- రణవీర్‌ విడిపోతున్నారా.. న్యూస్‌ వైరల్‌

 

Ranveer Deepika getting div

బాలీవుడ్ స్టార్‌ కపుల్ దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లపై కొన్ని రోజులుగా వివాహ బంధానికి స్వస్తి చెప్పనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారనేదే ఆ ప్రచారం. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, కొంత కాలంగా ఎడమొహం, పెడమొహంలా ఉన్నారని అంటున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, త్వరలోనే విడాకులు తీసుకుంటారని బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధూ ఇటీవలే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు… ఈ రోజు ఉదయం దీపిక తన తల్లితో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దీపిక చేతికి ఉండాల్సిన వెడ్డింగ్ రింగ్ కనిపించలేదు. దీంతో, ఈ వార్త నిజమేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu