తరుచు వివాదాలతో వార్తల్లో ఉండే బాలీవుడ్ ఐటెమ్ గర్ల్ రాఖీ సావంత్.. రణ్‌వీర్, దీపికాలకు నిజంగా పెళ్లయ్యిందా అని ఆశ్చర్యపోతోంది. ఇది తాను అస్సలు నమ్మలేకపోతుందట. బహుసా, అది పెళ్లి కాకపోయి ఉండొచ్చని, ఫొటోషూట్ కావచ్చని కామెంట్ చేస్తూనే.. దీనిపై రణ్ వీర్ క్లారిటీ ఇవ్వాలంటూ తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఫన్నీ వీడియో పోస్ట్ చేసింది.
దీపికా, రణ్‌వీర్‌ల పెళ్లిపై స్పందిస్తూ.. ‘రణ్‌వీర్.. నిజంగానే నీకు పెళ్లయ్యిందా? లేదా సవ్యసాచి క్యాట్‌లాగ్ షూటా? ఏదో ఒక రోజు నాకు పెళ్లి కాలేదని షాకిస్తావా? ఇది సరదాగా చేసిన ఫొటో షూటా? మీరిద్దరూ చాలా చాలా గొప్ప జంట’ అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో వీడియో పోస్ట్ చేసింది. దీనిపై ఆమె అభిమానులు కూడా అంతే ఫన్నీగా సమాధానం ఇస్తున్నారు. ‘నీకు పెళ్లయితే మేము కూడా ఇలాగే స్పందిస్తాం. రాఖీ నిజంగా పెళ్లి చేసుకున్నావా? ఆటపట్టిస్తున్నావా? అని అడుగుతాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రాఖీ మాత్రమే కాదు.. చాలామంది ‘సవ్యసాచి’ పేరును తలచుకుంటున్నారు. ఇంతకీ ‘సవ్యసాచి’ ఎవరంటే.. సెలబ్రిటీల వివాహాలకు అందమైన వస్త్రాలను డిజైన్ చేసే సంస్థ. వీరు తయారు చేసే దుస్తులకు ‘సవ్యసాచి కలెక్షన్స్’ అని పేరుంది. టాలీవుడ్ ప్రేమ జంట ‘నాగచైతన్య – సమంత’లకు పెళ్లి వస్త్రాలు డిజైన్ చేసింది కూడా ఈ సంస్థే. హీరోయిన్లు సోహా అలీఖాన్, అసిన్, బిపాసా బసు, కరీనా కపూర్‌ల పెళ్లి వస్త్రాలను కూడా వీరే డిజైన్ చేశారు.