HomeTelugu Trendingడియర్ కామ్రేడ్‌ సినిమాపై కర్నాటకలో అభ్యంతరం..!

డియర్ కామ్రేడ్‌ సినిమాపై కర్నాటకలో అభ్యంతరం..!

8 23
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఈరోజు ప్రేక్షకులముందుకొచ్చింది. గీత గోవిందం సినిమాతో విజయ్‌దేవరకొండ-రష్మిక జంటకు క్రేజీ జోడీగా పేరొచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. ఓ రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ లోగా సినిమా నిలిపివేయాలంటూ సోషల్‌ మీడియాలో డిమాండ్స్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

8a 1

డియర్ కామ్రేడ్ సినిమా నాలుగు భాషల్లో విడుదలైంది. ఇతర రాష్ట్రాల్లో సైతం విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున ఈ సినిమా విడుదల చేశారు. 4 భాషల్లో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌పై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. కన్నడ వెర్షన్ కంటే ఎక్కువ థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారని దానిని అవమానంగా భావిస్తూ మండిపడుతున్నారు. మాతృభాష కన్నడ వెర్షన్లో తక్కువ థియేటర్స్‌కి ఇచ్చారని, అందుకే తెలుగు వెర్షన్‌ను వెంటనే బ్యాన్‌ చేయాలని సోషల్‌ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu