
David Warner in Nithiin Robinhood:
నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ ఈ నెలాఖరున విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రీ-రిలీజ్ హైప్ పెంచేందుకు చిత్రబృందం వినూత్న ప్రమోషన్‌లు నిర్వహిస్తోంది. ఇప్పటికే ‘అదిదా సర్‌ప్రైజు’ పాట హిట్ అయ్యి సినిమాపై అంచనాలను పెంచగా, క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ ఇందులో నటించడం మరో ప్రధాన ఆకర్షణగా మారింది.
వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ మైదానంలో సునామీలా ఆడే ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలతోనూ పెద్ద స్టార్‌గా మారిపోయాడు. ‘పుష్ప’ సినిమాలోని అల్లు అర్జున్ స్టెప్పులను రీక్రియేట్ చేసి, రీల్స్ ద్వారా తన టాలెంట్ చూపించాడు. ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాల్లోనూ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
View this post on Instagram
డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’లో ఓ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. కేవలం గెస్ట్ అప్పీరెన్స్ కాదు, తన క్యారెక్టర్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుందట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, అతని పాత్రకు కనీసం 5 నిమిషాల స్క్రీన్ టైం ఉంటుందని తెలుస్తోంది.
వార్నర్ కోసం 4 రోజుల పాటు షూటింగ్ జరిపారని, దీనికి గాను రూ. 2.5 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. అసలు స్టార్టింగ్‌లో అతను రోజుకు రూ. 1 కోటి డిమాండ్ చేశాడని, మైత్రీ మూవీ మేకర్స్ నెగోషియేట్ చేసి రూ. 2.5 కోట్ల డీల్ క్లోజ్ చేశారని అంటున్నారు. 5 నిమిషాల పాత్రకు ఇంత భారీ మొత్తం ఇచ్చారా? అన్న ప్రశ్న నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
డేవిడ్ వార్నర్ క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ మాస్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ. ఆయన తెలుగు సినిమాల్లో నటించడం ‘రాబిన్ హుడ్’కు అదనపు క్రేజ్ తెచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ పారితోషికానికి న్యాయం చేసాడా? లేదా? అన్నది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది.
ALSO READ: Rajamouli కూతురిని లంచ్ కి తీసుకువెళ్లిన బాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?