HomeTelugu News'నువ్వు.. దేవసేన' డేటింగ్‌లో ఉన్నారా..

‘నువ్వు.. దేవసేన’ డేటింగ్‌లో ఉన్నారా..

11 8టాలీవుడ్‌ స్టార్‌ హీరో,హరోయిన్లు ప్రభాస్‌, అనుష్కలు ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ప్రభాస్‌, అనుష్క ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చినప్పటికీ వదంతులకు మాత్రం తెరపడటంలేదు. దీని గురించి తెలుసుకోవాలని బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌కు కూడా అనిపించినట్లుంది. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్’ కార్యక్రమంలో ప్రభాస్‌ను దీని గురించి అడిగారు కరణ్‌.

ఈ కార్యక్రమానికి ‘బాహుబలి’ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి, ప్రభాస్‌, రానా దగ్గుబాటి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరణ్‌.. ప్రభాస్‌ను అనుష్క గురించి అడిగారు. ‘నువ్వు ‘దేవసేన’ అనుష్కతో డేటింగ్‌లో ఉన్నావని వస్తున్న గుసగుసలు నిజమా? కాదా?’ అని అడిగారు. ఇందుకు ప్రభాస్‌..’లేదు’ అన్నారు. ‘కానీ గుసగుసలు వినిపిస్తున్నాయి కదా..’ అని కరణ్‌ అడగ్గా.. ‘ఈ గుసగుసలను మొదలెట్టింది మీరే..’ అని చమత్కరించారు. దాంతో కరణ్‌తో పాటు పక్కనే ఉన్న రాజమౌళి, రానా పగలబడి నవ్వుకున్నారు. ఆ తర్వాత కరణ్‌ ప్రభాస్‌ను మరో ప్రశ్న అడిగారు. ‘నాకు అబద్ధాలు చెప్పావు కదూ..’ అని అడగ్గా.. ‘అవును’ అని చెబుతూ ప్రభాస్‌ అక్కడున్న గ్లాస్‌లోని డ్రింక్‌ తాగడం ఫన్నీగా ఉంది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రాలు హిందీలోనూ విడుదలైన సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్‌కు ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ద్వారా కరణ్‌, రానా, రాజమౌళి, ప్రభాస్‌ మంచి స్నేహితులయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu