HomeTelugu Big StoriesOG సినిమా షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

OG సినిమా షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

Date locked for Pawan Kalyan OG shooting?
Date locked for Pawan Kalyan OG shooting?

OG Shooting Update:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ OG సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో ఫిలిం డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంచెం పూర్తయింది కూడా. కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కొంచెం బిజీ అయ్యారు. ఎన్నికల సమయం నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరంగా ఉన్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక సర్ప్రైజ్ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆరోజు లేదా సెప్టెంబర్ 3 నుంచి ఈ సినిమా షూటింగ్ తిరిగి పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తల వినిపిస్తున్నాయి.

ఒకవేళ అది నిజం అయితే కచ్చితంగా ఫ్యాన్స్ కి ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. ఇప్పటికే సుజిత్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ అయిన విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

OG సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టార్ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ చేతుల్లో హరిహర వీరమల్లు సినిమా కూడా పెండింగ్లో ఉంది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇంకా చేయాల్సి ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu