వెండితెరపై ఎన్నో అపురూప ఆణిముత్యాలను ఆవిష్కరించి అనారోగ్యం కారణంగా దివికేగిన దాసరి నారాయణరావు జయంతి నేడు. అయితే దాసరి నారాయణరావుతో మోహన్‌బాబు కుటుంబానికి మంచి స్నేహబంధం ఉందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాసరి జయంతిని పురస్కరించుకుని మంచులక్ష్మి ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
నాకు ఎంతో ప్రియమైన దాసరి అంకుల్ జయంతి సందర్భంగా అనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాను. ఆయన గైడెన్స్, మా మధ్య ఉన్న అనుబంధం, కథలు, అలాగే ఆయన చిరునవ్వు అన్నింటిని ఎంతగానో మిస్ అవుతున్నాను. ఏదైనా ఒక విషయంలో సలహా కావాలన్నా లేదా ఏదైనా సాయం కావాలన్నా నాతోపాటు ఇంకా ఎంతో మంది ఆయన దగ్గరికే వెళ్లే వాళ్లం. మిస్ యూ అంకుల్’ అని మంచులక్ష్మి ట్వీట్ చేశారు.
Remembering the Good old days of my dearest Dasari uncle’s Birthday😇I miss his guidance, our beautiful banter, the stories, heartfelt laughs & convo about cinema😪 He’s the one, I or anyone else would reach out to when in need of advice or help. Miss you Uncle😓 Happy Birthday!! pic.twitter.com/QKgAVO7K6V
— Lakshmi Manchu (@LakshmiManchu) May 4, 2020