HomeTelugu Newsఆస్తి తగాదా.. మీడియా ముందుకు దాసరి కొడుకు

ఆస్తి తగాదా.. మీడియా ముందుకు దాసరి కొడుకు

2 27
ప్రముఖ సినీ దర్శకుడు, దివంగత దాసరి నారాయణ రావు చిన్న కొడుకు అరుణ్‌పై పెద్ద కుమారుడు ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 24న దాసరి అరుణ్ కుమార్.. ఇంట్లోకి చొరబడి తమపై దాడి చేశాడని ప్రభు ఫిర్యాదు చేశారు. ఇండస్ట్రీని ఏలిన దాసరి కుమారుల మధ్య వివాదాన్ని సినీ పెద్దలు పరిష్కరించాలని పెద్ద కుమారుడు ప్రభు కోరుతున్నారు. ఇక తన అన్న ప్రభు తనపై చేసిన ఆరోపణలపై అరుణ్ స్పందించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”మా అన్నయ్య దగ్గర కోర్టు ఉత్తర్వు ఏమైనా ఉందా? ఆస్తికి సంబంధించిన వీలునామా ఉంటే చూపించాలి. అన్నయ్య, సోదరితో నాకు ఎలాంటి వివాదాల్లేవు. మాది చిన్న కుటుంబం కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. అన్నయ్యకు సమస్యలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఇంట్లోకి అక్రమంగా వెళ్లలేదు. మా ఇంట్లోకి నేను వెళ్లాను. ఇల్లు మా ముగ్గురిదీ. నేను సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు సమస్యను పరిష్కరిస్తామంటే నాకేం అభ్యంతరం లేదు” అని అరుణ్‌ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu