దసరా కానుకగా ఎన్నో సినిమాలు రిలీజ్ అవ్వడం, కొత్త సినిమాలు మొదలవ్వడం జరుగుతూ ఉంటాయి.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా దసరా కానుకగా తను నటిస్తోన్న ‘దృవ’ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు.
అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమాను దీపావళికి పోస్ట్ పోన్ చేశారు. అభిమానులను నిరాశ
పరచకూడదనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ దసరా రోజున సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి చరణ్ ఏ మేరకు
ఈ సినిమాతో మెప్పిస్తాడో.. చూడాలి!