HomeTelugu Trendingఎన్టీఆర్‌ 'దేవర'లో దసరా విలన్‌

ఎన్టీఆర్‌ ‘దేవర’లో దసరా విలన్‌

Dasara villain in ntr devar
ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మూవీలోని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించిన అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

‘దసరా’ సినిమాలో విలన్‌గా నటించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ‘దేవర’ లో కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై తన ఇన్‌స్టా స్టోరీస్‌లో హింట్ ఇచ్చారు షైన్ టామ్. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ చిత్రంలో విలన్‌ పాత్రలో నటించి మెప్పించాడు టామ్ చాకో. ప్రస్తుతం యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ‘రంగబలి’ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో తను నటిస్తున్న విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా వెల్లడించారు టామ్ చాకో. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ను షేర్ చేయడం ద్వారా హింట్ ఇచ్చారు. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న ఈ చిత్ర కథ కూడా పవర్‌ఫుల్‌గా ఉండటం కలిసొచ్చే అంశం కాగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu