![Darshan World Cup Connection: ఇండియా వరల్డ్ కప్ గెలవాలి అంటే ఈ హీరో జైల్ కి వెళ్ళాలట 1 Darshan World Cup Connection](https://www.klapboardpost.com/wp-content/uploads/2024/07/t20.jpg)
Darshan World Cup Connection:
కన్నడ నటుడు దర్శన్ జైల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. దర్శన్ ఒక హత్య కేసులో ఇరుక్కున్నారు. తన ప్రేయసి పవిత్ర గౌడ కి అసభ్యకరమైన మెసేజెస్ చేశాడు అన్న కోపంతో తన అభిమాని రేణుక స్వామి ని దర్శన్ దారుణంగా హత్య చేశారని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
కొంతమంది కిరాయి గూండాలతో దర్శన్ రేణుక స్వామి మీద దాడి చేసి, చాలా దారుణంగా చంపేసినట్టు కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. అయితే దర్శన్ జైలుకి వెళ్లడానికి, టీం ఇండియా వరల్డ్ కప్ గెలవడానికి మధ్య ఒక పెద్ద కనెక్షన్ ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దర్శన్ జైలుకి వెళ్లడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రెండు సార్లు వెళ్లారు. అయితే దర్శనం జైలుకి వెళ్ళిన ప్రతిసారి ఇండియా ఏదో ఒక మ్యాచ్ లో గెలుస్తూనే వచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియా గెలవాలి అంటే దర్శన్ జైల్లోనే ఉండాలి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Darshan World Cup Connection:
2011లో దర్శన్ మొదటిసారి జైలుకి వెళ్లారు. తన భార్య విజయలక్ష్మి పెట్టిన డొమెస్టిక్ వైలెన్స్ కేసు వల్ల దర్శన్ జైలుకి వెళ్లారు. 2011లో టీం ఇండియా వరల్డ్ కప్ గెలిచిన సంగతి ఎవరూ మర్చిపోలేరు. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. క్రికెట్ అభిమానులకి, ఎంఎస్ ధోని అభిమానులకి ఆ వరల్డ్ కప్ చాలా ప్రత్యేకమైనది.
ఆ తర్వాత 2013 లో కూడా దర్శన్ జైలుకి వెళ్ళారు. అప్పుడు కూడా టీం ఇండియా ఇంగ్లాండ్ తో ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.
మొదటిసారి దర్శన్ 2011లో జైలుకి వెళ్లారు. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో తన సొంత భార్య విజయలక్ష్మి అతనిపై కేసు వేయగా దర్శన్ జైలు పాలయ్యారు. ఆ ఏడాది భారతదేశం భారీ విజయంతో వరల్డ్ కప్ గెలుచుకుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. క్రికెట్ అభిమానులకి అది మర్చిపోలేని సంవత్సరం.
ఆ తర్వాత 2013లో కూడా దర్శన్ జైలుకి వెళ్లారు. అప్పుడు కూడా టీం ఇండియా ఇంగ్లాండ్ కి వ్యతిరేకంగా ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇక ఈ ఏడాది కూడా దర్శన్ జైలుకి వెళ్ళారు. ఈసారి ఏకంగా హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యారు. ఈ ఏడాది కూడా టీం ఇండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. దీంతో నెటిజన్లు దర్శన్ జైలుకు వెళ్లడానికి ఇండియా గెలవడానికి మధ్య కనెక్షన్ ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది ఇండియా టి20 వరల్డ్ కప్ గెలవడానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కృషి ఎంత కారణమో, దర్శన్ జైలుకి వెళ్లడం కూడా అంతే అంటూ కొందరు వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరి ఏమో దర్శన్ జైలుకి వెళ్లి వస్తుంటేనే టీమ్ ఇండియా గెలుస్తుంది అంటే ఎలాగో హత్య కేసులో ఇరుక్కున్నారు కాబట్టి ఈసారి పూర్తిగా జైల్లోనే ఉండిపోతే ఇండియా అని ఆపే వాళ్ళు ఉండరు అంటూ జోక్ చేస్తున్నారు.