HomeOTTDarling: అపరిచితుడు లాంటి సినిమా.. హిట్ అయిందా?

Darling: అపరిచితుడు లాంటి సినిమా.. హిట్ అయిందా?

Darling receives lukewarm response on OTT
Darling receives lukewarm response on OTT

Darling OTT:

ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా డార్లింగ్. ఈ సినిమాను మేకర్స్ భారీగా ప్రమోట్ చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ ఫ్లాప్‌గానే నిలిచింది. అపరిచితుడు లాంటి సినిమా కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆశించినంత ఆదరణ పొందలేదు.

ఇప్పటికే రెండు రోజులుగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, ఓటీటిలో కూడా ప్రేక్షకులను ఆకర్షించలేకపోతోంది. యావరేజ్ సినిమా అయినప్పటికీ.. వెండి తెరపై సినిమా చూసే అవకాశం లేకపోయినా.. లేదా ధియేటర్ దాకా వెళ్లకపోయినా.. ప్రేక్షకులు ఆ సినిమాని ఓటిటి ప్లాట్‌ఫారమ్స్‌లో చూడడానికి ఆసక్తి చూపిస్తారు.

డార్లింగ్ సినిమాకు కూడా అదే జరుగుతుందని దర్శక నిర్మాతలు ఆశించారు. కానీ ఈ సినిమా ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఎక్కువగా ఆదరణ పొందలేకపోయింది. ఈ సినిమాలో నభా నటేష్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న అమ్మాయి పాత్రలో నటించింది. ప్రియదర్శి కూడా తన పాత్రలో బాగానే నటించాడు.

అయితే, వీరి నటన చిత్రాన్ని ఓటిటిలో కూడా హిట్ అయేలా చేయలేకపోయింది. ఈ సినిమాకి అశ్విన్ రామ్ అనే డైరెక్టర్ దర్శకత్వం వహించారు కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu