Daniel Balaji: కోలీవుడ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ (48) హఠత్తుగా మృతి చెందారు. కాగా, ఈయన శుక్రవారం అర్థరాత్రి ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రవైటు ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు బాలాజీ హాస్పిటల్ కు తరలించేలోపే గుండేపోటుతో మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు.
బాలాజీ మరణ వార్త తెలియడంతో ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సెలబ్రిటీలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పలు చిత్రాల్లో విలన్‌గా నటించిన డేనియల్ బాలాజీ చనిపోతూ కూడా తన గొప్ప మనసును చాటుకుని హీరోగా నిలిచారు.
డేనియల్ బాలాజీ కూడా తాను మరణించినప్పుడు తన నేత్రాలను దానం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఆయన చనిపోతూ.. మరో ఇద్దరికి చూపును ఇవ్వలనది తన గొప్ప ఆశయం. అందుకు తగ్గాట్టుగానే.. ఐ రిజిస్టర్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అలాగే కుటుంబ సభ్యులతో అంగీకార ధ్రువపత్రం కూడా పొందాడు.
కాగా, డేనియల్ బాలాజీ మరణం తర్వాత.. ఆయన కళ్లను చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రి వారు సేకరించి భద్రపరిచారు. అలాగే చూపులేని మరో ఇద్దరికి చూపును ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇక డేనియల్ బాలాజీ తన నేత్రాలను దానం చేసేందుకు సంబంధించిన ఆపరేషన్ పూర్తి అయిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
అనంతరం ఆయన భౌతికాయన్ని తిరువాన్మియూర్‌లోని తన స్వగృహానికి తరలించనున్నారు. రేపు ఆయన నివాసంలోనే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. తాను సజీవంగా లేకపోయినా.. మరో ఇద్దరికి తన కళ్లను దానం చేసిన మంచి హృదయం డేనియల్ బాలాజీది అని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.