నితిన్, శ్రీలీల జంటగా ‘ఎక్స్ ట్రా’ సినిమా రూపొందుతోంది. ఆర్డినరీ న్యూస్ ట్యాగ్ లైన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘డేంజర్ పిల్లా పిల్లా’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈపాటకు హరీష్ జయరాజ్ స్వరాలు అందించారు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. “అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా .. చీకట్లో తిరగని మిణుగురు తళుకువా” అంటూ ఈ పాట సాగుతోంది. విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు.
ఈ పాటకు శేఖర్ మాస్టర్ డ్యాన్స్ డైరెక్టర్. ఇందులో నితిన్ క్లాసిక్ లుక్‌లో కనిపించగా, శ్రీలీల చాలా గ్లామరస్‌గా కనిపిస్తోంది. డిసెంబర్ 23న ఈ సినిమా విడుదల కాబోతుంది. హీరోగా నితిన్ కీ .. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఈ సినిమా హిట్ చాలా అవసరం. ఇద్దరి ఆశను ఈ సినిమా నెరవేర్చుతుందేమో చూడాలి.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో రావు రమేశ్, సంపత్, సుదేవ్ నాయర్, బ్రహ్మాజీ, రోహిణి, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. సుధాకర రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నా పేరు సూర్య మూవీ తర్వాత డైరెక్టర్‌గా వక్కంతం వంశీకి ఇది రెండో సినిమా. గతేడాది నితిన్ హీరోగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం తీవ్రంగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ అయింది. దీంతో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ హిట్ నితిన్‍కు కీలకంగా మారింది.