టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది. తన కుటుంబానికి అత్యంత దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ బుధవారం పెళ్లిచేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఇక మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకను నిర్వహించారు. అయితే పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ పెళ్లిలో వధువరులకు సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా దగ్గుబాటి ఫ్యామిలీ జాగ్రత్త పడింది.
ఇదిలా ఉంటే.. తాజాగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి నుంచి దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫొటోలో దగ్గుబాటి సురేశ్ బాబు – ఆయన భార్య, వెంకటేష్ -ఆయన భార్య, వెంకటేష్ పిల్లలు, రానా- ఆయన భార్య మిహికా బజాజ్, నాగచైతన్య, అలాగే కుటుంబ సభ్యులు ఉన్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.