టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి ఘనంగా జరిగింది. డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది.
శ్రీలంక లో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగిందని కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. తన కుటుంబానికి అత్యంత దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ బుధవారం పెళ్లిచేసుకున్నాడు. అభిరామ్ పెళ్లి వేడుకలో రానా దంపతులు సందడి చేశారు.
ఇంకా దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వారు మరియు ప్రత్యూష ఫ్యామిలీకి చెందిన వారు వివాహ వేడుకలో పాల్గొన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో టాలీవుడ్ ప్రముఖులతో పాటు, బంధు మిత్రులకు, ఫ్యాన్స్ కి భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసి దగ్గుబాటి వారు విందు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవలే ప్రత్యూషతో అభిరామ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.