దగ్గుబాటి వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి జరగబోతోంది. పెళ్లికూతురు వారి దగ్గర బంధువే. తన చినతాత కూతురు కూతురే పెళ్లికూతురు.
వధువు పేరు ప్రత్యూష. ఈ నెలలోనే వీరి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కావడం గమనార్హం. శ్రీలంకలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు వివాహ వేడుక జరగనుంది. ఈ పెళ్లికి దాదాపు 200కు పైగా అతిథులు హాజరుకానున్నట్టు సమాచారం.
ఈ రోజు రాత్రి గ్రాండ్ డిన్నర్ తో వివాహ వేడుక ప్రారంభం కానుంది. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మెహందీ వేడుక జరగనుందట. ఇక బుధవారం ఉదయం 10.30 గంటలకు పెళ్లి కూతురు చేయడం నుంచి రాత్రి 7 గంటలకు వీరి వివాహం జరగనుందని సమాచారం.
శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ని నిర్వహించాలని దగ్గుబాటి ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సినిమాల విషయానికి వస్తే… అభిరామ్ ‘అహింస’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తేజ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.