దగ్గుబాటి ఫ్యామిలీలో మళ్లీ పెళ్లి భాజాలు మోగబోతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. రామానాయుడు ముద్దుల మనవడు సురేష్ బాబు చిన్న కొడుకు అభిరాం పెళ్లి కోడుకు కాబోతున్నాడు అని తెలుస్తోంది. అమ్మాయి రామానాయుడు తమ్ముడు మనవరాలినే అభిరాం పెళ్లాడబోతున్నాడుట. ప్రస్తుతం దగ్గుబాటి కుటుంబం పెళ్లి హడావుడిలోనే పడినట్లు టాక్.
అమ్మాయి మాస్ కమ్యూనికషన్ చేసిందని సమాచారం. ఆ కుటుంబం కారంచేడులో ఉంటుందిట. కాగా ఇది ప్రేమ వివాహమనే తెలుస్తోంది. అభిరాం-అమ్మాయి ఇద్దరు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నారుట. ఆవిషయం పెద్దలకు తెలియడంతో వివాహ బంధంతో ఒకటి చేయాలని నిశ్చయించినట్లు సన్నిహితుల నుంచి తెలిసింది.
అలాగే వాళ్లిద్దరి పెళ్లి చేయాలని రామానాయుడు కూడా అనుకునేవారుట. వీరి పెళ్ళి ఇండియాలో కాకుండా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి తేదీ కూడా నిర్ణయించారుట. డిసెంబర్ 6న పెళ్లి డేట్ ఫిక్స్ చేశారంట. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.