భారతీయ చలన చిత్ర పితామహుడిగా పేరుగాంచిన దాదాసాహెబ్ ఫాల్కే 150వ జయంతి సందర్భంగా ఆయన పేరుమీద సౌత్‌లో తొలిసారి అవార్డులను అందజేస్తున్నారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో మాత్రమే జరిగింది. హైదరాబాద్‌లోని ఎన్. కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ హాజరయ్యారు.
ఉత్తమ నటుడిగా మహేశ్‌బాబుకు అవార్డు దక్కింది. భరత్ అనే నేను చిత్రంలో నటనకు గాను మహేష్‌బాబు ఈ అవార్డును దక్కించుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మహేశ్ హాజరు కాలేదు. ఆయన తరపున మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ అవార్డును స్వీకరించారు. తెలంగాణ గవర్నర్ తమిళసై చేతుల మీదుగా నమ్రత ఈ అవార్డును అందుకున్నారు. సీనియర్ నటుడు మోహన్‌బాబుకు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. భారతీయ సినిమా అభివృద్ధిలో దక్షిణాది చిత్రాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.