దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు 2024 ఈవెంట్ నిన్న మంగళవారం (ఫిబ్రవరి 20) రాత్రి ముంబైలో ఘనంగా జరిగాయి. ఈ అవార్డుల్లో యానిమల్ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకోవడం విశేషం. ఇక ఉత్తమ నటీనటులుగా షారుక్ ఖాన్, నయనతార నిలిచారు. ఈ అవార్డుల వేడుకకి బాలీవుడ్ సెలబ్రెటీలంతా హాజరయ్యారు.
బాలీవుడ్‌లో గతఏడాది జవాన్, యానిమల్ హవా నడిచిన సంగతి తెలిసిందే. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా షారుక్ ఖాన్ నటించిన జవాన్ నిలిచింది. ఈ సినిమాలో నటించిన షారుక్ ఖాన్, నయనతార ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకోవడం విశేషం. ఇక యానిమల్ మూవీ రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోపాటు బెస్ట్ విలన్ గా బాబీ డియోల్ నిలిచాడు.
ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ ఈ సినిమా దుమ్ము రేపింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. థియేటర్లలోనే కాదు తర్వాత ఓటీటీలోనూ యానిమల్ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ లో అతి ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ మూవీపై ఎన్ని విమర్శలు ఉన్నా.. ఆ మూవీ అదే స్థాయిలో అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది.
ఇక జవాన్ మూవీ 2023లో అత్యధిక వసూళ్లు సాధించింది. అంతకుముందు అదే ఏడాది పఠాన్ తో వెయ్యి కోట్ల సినిమా అందుకున్న షారుక్ ఖాన్.. వరుసగా రెండో సినిమాను కూడా ఆ మార్క్ దాటించాడు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి షారుక్, నయనతార ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకున్నారు. అంతేకాదు మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. మొత్తంగా ఈ రెండు సినిమాలు కలిపి ఐదు కీలకమైన అవార్డులు గెలుచుకున్నాయి.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల విజేతలు
ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్)
ఉత్తమ నటి: నయనతార (జవాన్)
ఉత్తమ నటి: రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ vs నార్వే)
ఉత్తమ దర్శకుడు: సందీప్ రెడ్డి (యానిమల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (జవాన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు – వరుణ్ జైన్ – తేరే వాస్తే (జర హట్కే జర బచ్కే)
ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు: బాబీ డియోల్ (యానిమల్)
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటి: రూపాలీ గంగూలీ (అనుపమ)
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటుడు: నీల్ భట్