వెంకటేష్‌తో కలిసి వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2’ వందకోట్ల వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 2’ సినిమా తర్వాత ఈ హీరోలు ఇద్దరూ కలిసి హాలీవుడ్ సినిమా ‘అలాద్దీన్’కి తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తర్వాత ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో వరుణ్ తేజ్ మాస్ సినిమాలు కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. వైవిధ్యమైన కథలు, జానర్లు ట్రై చేస్తూ ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి ముంజ్రేకర్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. సల్మాన్‌ఖాన్ సరసన దబాంగ్3లో నటించింది సాయి ముంజ్రేకర్. తొలి సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మను వరుణ్ సరసన నటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.