Daaku Maharaaj Review:
డాకూ మహారాజ్ సినిమా మీద ప్రేక్షకులకి మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? బాలయ్య అభిమానులకు ఈ సినిమా నచ్చుతుందా? చూద్దాం!
కథ:
సీతారాం అనే సివిల్ ఇంజినీర్ ఎలా డాకూ మహారాజ్ అవుతాడు? అతని జీవితంలో ఓ చిన్న పాపతో ఉన్న అనుబంధం, అతడిని డాకూ గా మారవలసిన పరిస్థితులు ఏంటి? అతని జీవితాన్ని మార్చేసిన సామాజిక సమస్య ఏమిటి? ఇవన్నీ ఈ సినిమా ప్రధాన కథ.
నటీనటులు:
బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. ఒకటో లుక్ నార్మల్ బాలయ్య లా ఉంటుంది, కానీ స్టైలిష్‌గా. రెండో లుక్, అంటే డాకూ లుక్ కొంచెం కొత్తగా అనిపించినా, ఫ్యాన్స్ ఎక్కువగా ఇంపాక్ట్ ఫీల్ అవ్వలేకపోయారు. ఒక ఎమోషనల్ సీన్‌లో బాలయ్య నటన మాత్రం టాప్ నాచ్! చిన్న పాప గురించి మాట్లాడేటప్పుడు ఆయన చెప్పిన డైలాగ్స్ కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ పాత్రలు చిన్నవే, కానీ వారు తాము చేయాల్సింది చక్కగా చేశారు. ఊర్వశి రౌతేలా గ్లామర్ షోతో తెరపై కాసేపు బాగానే అలరించింది. ప్రత్యేకమైన సాంగ్‌లో మరింత అందంగా కనిపించింది. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. కానీ అతని పాత్రలో అంత బలమే లేదు. రొటీన్ కమర్షియల్ విలన్‌లానే అనిపించారు.
సాంకేతిక అంశాలు:
సినిమా విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. విజయ్ కార్తిక్ కన్నన్ కెమెరా పనితనం అద్భుతం.
థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద బలం. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సీన్‌లను ఎలివేట్ చేసింది.
ఎడిటింగ్ ఇంకొంచెం బాగుండచ్చు అనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది.
ప్లస్ పాయింట్స్:
*బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్
*హై ప్రొడక్షన్ వాల్యూస్
*థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
*స్టైలిష్ విజువల్స్
మైనస్ పాయింట్స్:
-కొత్తదనం లేకపోవడం
-సెకండ్ హాఫ్ స్లోగా సాగడం
-క్లైమాక్స్ బలహీనంగా ఉండడం
-విలన్ పాత్రలో పవరే లేకపోవడం
తీర్పు:
డాకూ మహారాజ్ సినిమా బాలకృష్ణ అభిమానులకు బాగానే నచ్చుతుంది. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా వచ్చాయి. కానీ కథలో తక్కువ పాయింట్లు కనిపిస్తాయి. స్టోరీ కాస్త బలంగా ఉండి ఉంటే మరింత ఇంపాక్ట్ ఉండేది.
రేటింగ్: 2.75/5
ALSO READ: Game Changer ని ఊహించని దెబ్బ కొట్టిన తెలంగాణా ప్రభుత్వం!