Daaku Maharaaj OTT release:
ఈసారి సంక్రాంతి నందమూరి బాలకృష్ణ అభిమానులకు స్పెషల్ ఫెస్టివల్‌గా మారింది. బాలయ్య హీరోగా నటించిన “డాకూ మహారాజ్” బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి హ్యాండిల్ చేయగా, ఈ సినిమా అందరిలో ఆసక్తి రేపుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ అనే ప్రముఖ ఓటీటీ సంస్థ “డాకూ మహారాజ్” డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తం చెల్లించి తీసుకున్నట్టు సమాచారం. బాలకృష్ణ సినిమాలకు ఎప్పుడూ ఓటీటీ వేదికలపై మంచి డిమాండ్ ఉంటుందని, అదే విధంగా ఈ సినిమాకు కూడా అదిరిపోయే క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చందిని చౌదరి కీలక పాత్రల్లో కనిపించారు. సినిమాకు థమన్ సంగీతం అందించగా, పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బ్లాక్‌బస్టర్ టాక్‌తో థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో నిర్మాత నాగ వంశీ మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. “డాకూ మహారాజ్” సినిమాకు ప్రీక్వెల్ ఉండబోతోందని ఆయన కన్ఫర్మ్ చేశారు. దీని వల్ల నందమూరి ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది. మరి ఈ ప్రీక్వెల్ గురించి త్వరలో మరిన్ని వివరాలు రానున్నాయి.
మొత్తానికి “డాకూ మహారాజ్” బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం అందుకుని, ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోంది.