
Daaku Maharaaj OTT:
ఈరోజుల్లో సినిమా ఏ భాషలో వస్తుందోకంటే, ప్రేక్షకులతో ఎంత కనెక్ట్ అవుతుందో ముఖ్యం. ఓటీటీ వల్ల భాషా హద్దులు తగ్గిపోయాయి, కానీ తెలుగు సినిమాలు మాత్రం మలయాళ మార్కెట్‌లో ఎక్కువగా ప్రభావం చూపలేకపోతున్నాయి. కానీ నందమూరి బాలకృష్ణ నటించిన ‘దాకూ మహారాజ్’ మాత్రం అచ్చం వ్యతిరేకంగా జరిగింది!
ఒకప్పుడు మలయాళీ ప్రేక్షకులు తెలుగు సినిమాలకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అల్లు అర్జున్ మాత్రం చాలా తొందరగా అక్కడి మార్కెట్‌ను పట్టు చేసుకున్నాడు. ‘హ్యాపీ’ నుంచి ‘పుష్ప 1’ వరకు బన్నీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ ‘పుష్ప 2’ మాత్రం మలయాళీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో మోస్తరు కలెక్షన్లు చేసిన ఈ సినిమా, ఓటీటీలో కూడా అంతగా మజా ఇవ్వలేకపోయింది.
ఇక నందమూరి బాలకృష్ణ సినిమాలకు మలయాళంలో అసలు మార్కెట్ లేదనే భావన ఉంది. కానీ ‘దాకూ మహారాజ్’ మాత్రం ఊహించని రీతిలో అక్కడ హిట్టయ్యింది! Netflixలో నాలుగు రోజుల్లోనే హైప్ పెరిగిపోయింది.
‘దాకూ మహారాజ్’ గురించి మలయాళ ప్రేక్షకులు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చిస్తున్నారు. బాలయ్య నటన, ఎలివేషన్ సీన్లు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అన్నీ హైలైట్ అవుతున్నాయి. గతంలో ఎప్పుడూ బాలయ్య సినిమాలను పట్టించుకోని ప్రేక్షకులు ఇప్పుడు అతని మాస్ అప్పీల్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఇది ఓటీటీ ప్రభావమే అని చెప్పాలి. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల అభిరుచులు మారిపోతున్నాయి. క్లాస్ సినిమాలు మాత్రమే చూసే మలయాళీ ఆడియన్స్, ఇప్పుడు మాస్ సినిమాలను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ‘దాకూ మహారాజ్’ మలయాళంలో బాలయ్యకు కొత్త మార్కెట్ తెచ్చిందా? అనే చర్చ మొదలైంది.