కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన నటించిన కెప్టెన్ మిల్లర్ విడదలై ఓ మోస్తరు హిట్ తెచ్చుకుంది. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కూడా ఓ సినిమా (DNS) చేస్తున్నారు. అలాగే, తన స్వీయ దర్శకత్వంలోనూ మరో చిత్రం (D50) చేస్తున్నారు.
ధనుష్ డైరెక్షన్ చేస్తూ ప్రధాన పాత్ర నటిస్తున్న ఆ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‍ను నేడు విడుదలైంది. ఈ సినిమాకి ‘రాయన్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో ధనుష్ ఫుడ్ ట్రక్ ముందు ఆఫ్రాన్ ధరించి.. చేతిలో చేతిలో పదునైన వస్తువును పట్టుకున్నారు ధనుష్.
ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ధనుష్ వెనుక ట్రక్‌లో సందీప్ కూడా ఉన్నారు. కెప్టెన్ మిల్లర్‌లో ధనుష్‍తో కలిసిన నటించిన సందీప్.. మరోసారి ఆయనతో రాయన్‍లో చేస్తున్నారు.
ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు కథ కూడా ధనుషే అందిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్, ఎస్‍జే సూర్య, కాళిదాస్ జయరాం, అపర్ణా బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, అనిఖా సురేంద్రన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రాఫర్‌గా ఉండగా.. ప్రసన్న జీకే ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతేడాది జూలైలో మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది వేసవికి ఈ చిత్రం రిలీజ్ అంటున్నారు .