తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ జనక్ కార్యాలయంపై పడింది. తౌక్టే తుఫాన్ వల్ల కురిసిన భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో తన కార్యాలయంలోకి వరదనీరు ప్రవేశించిందని అమితాబ్ తెలిపారు. తాను సిబ్బంది కోసం నిర్మించిన షెడ్లపై రేకులు ఎగిరిపోయాయని అమితాబ్ వెల్లడించారు. ‘‘తుఫాన్ మధ్యలో నిశ్శబ్దంగా ఉంది.. రోజంతా వర్షం పడుతోంది.. చెట్లు పడిపోయాయి, వరదనీరు జనక్ కార్యాలయాన్ని ముంచెత్తింది. తీవ్ర గాలులకు ప్లాస్టిక్ కవర్ షీట్లు ఎగిరిపోయాయి.. కొంతమంది సిబ్బంది తడిచిపోయారు’’ అని అమితాబ్ తన బ్లాగులో పేర్కొన్నారు. ‘‘నా సిబ్బంది యూనిఫాంలు తడిసినా వారు మరమ్మతు పనులు చేస్తూనే ఉన్నారని, వారికి నా వార్డ్ రోబ్ నుంచి దుస్తులు ఇచ్చాను’’ అని ఆయన పేర్కొన్నారు.
T 3906 – The winds and the rain of Cyclone Tauktae lashes us with intense ferocity .. my prayers for all to be safe and protected. .🙏🙏
— Amitabh Bachchan (@SrBachchan) May 17, 2021