HomeTelugu Newsకోల్‌కతాను అతలాకుతలం చేసిన ఆంఫన్ తుపాను

కోల్‌కతాను అతలాకుతలం చేసిన ఆంఫన్ తుపాను

11 18
పశ్చిమ బెంగాల్‌పై ఆంఫన్ తుపాను పంజా విసిరింది. కోల్‌కతాలో పెను విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి కోల్‌కతాలో వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుపాను తీరం దాటిన సమయంలో భీకర గాలులతో విరుచుకుపడింది. భారీ వర్షాలకు 84 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. దాదాపు 10 ఏళ్ల కాలంలో బెంగాల్‌లో భారీ
నష్టాన్ని మిగిల్చిన అతిపెద్ద తుపాను. తీర ప్రాంతాలతో పాటు కోల్‌కతా నగరాన్ని అతలాకుతలం చేసింది. తుపాను బీభత్సంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు.

11a 3

తుపాను తీరం దాటే సమయంలో వీచిన ప్రళయ భీకర గాలులకు భారీ వృక్షాలు సైతం నేల కూలాయి. భారీ సంఖ్యలో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వేలాది ఇళ్లు నేలమట్టాయి. అనేకమంది నిరాశ్రయులయ్యారు. కోల్‌కతా విమానాశ్రయంలో రన్‌వేపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆంఫన్ తుపాను కరోనా కంటే అతిపెద్ద ఉపద్రవంగా మమతా బెనర్జీ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఉత్తర పరగణాల జిల్లాలో తుపాను తీవ్రత ఎక్కువగా ఉందని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలని, వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సీఎం మమత కోరారు. తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల పునరుద్ధరణకు ఆర్థిక సహాయం చేయాలన్నారు.

ఆంఫన్ తుపాను ఒడిశాలోనూ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుపాను ధాటికి ఒడిశాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu