వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కేసులో సైబర్ క్రైమ్ విచారణను మరింత వేగవంతం చేసింది… ఈ కేసులో ఎనిమిది యూట్యూబ్ చానెళ్లకు నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌ఐఆర్ పేరుతో వీడియోలు తయారు చేసిన వెబ్ ఛానెళ్ల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఇప్పటికే ఎనిమిది వెబ్ సైట్లకు నోటీసులు జారీ చేసిన పోలీసులు… ఐదుగురి అరెస్ట్‌కు నోటీసులు ఇచ్చారు. యూట్యాబ్ ఛానెళ్లు 10 రోజుల్లోగా పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ ముమ్మరం చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు… ఒక్కో యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధిని పిలిచి విచారించి నోటీసులు ఇస్తున్నారు. చాలా మంది యూట్యూబ్ ఛానెళ్ల యజమానులు పోలీసు విచారణకు హాజరుకాకుండా.. తమ ఛానెల్‌లో పనిచేసేవారిని పంపిస్తున్నారు. ఛానెల్ యజమానులు వెంటనే హాజరుకావాలంటూ పోలీసులు ఆదేశించారు. అప్పుడే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.